Wednesday, January 22, 2025

ఫ్లూతో జాగ్రత్త!

- Advertisement -
- Advertisement -

రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చినా, దాని ప్రభావం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలపై ఇంకా కనిపిస్తూనే ఉంది. దీని మూలాలను పూర్తి స్థాయిలో కనుగునే ప్రయత్నంలో ఇంకా శాస్త్రవేత్తలున్నారు. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలువురు దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలతో బాధ పడుతున్నారు. ఇవి ఫ్లూ వ్యాధి లక్షణాలు మాత్రమేనని, కరోనా వ్యాధి మాత్రం కాదని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా తీవ్రమైన దగ్గు, జ్వరం కేసులు పెరుగుతున్నట్లు ఐసిఎంఆర్ నివేదిక వెల్లడించింది. లక్షణాలు ఒక వారం కంటే ఎక్కువ సమయం ఉంటాయి. ఇన్‌ఫ్లుయెంజా A H3N2, ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఉపరకం, ఈ సమస్యకు ప్రధాన కారణమని గుర్తించారు ఆరోగ్య నిపుణులు.

దేశంలోని గణాంకాలను పరిశీలిస్తే, ఫ్లూతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందన్నారు. గత రెండు మూడు నెలలుగా ఈ రకం వైరస్ భారత్‌లో విస్తరిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో విస్తరిస్తున్న ఈ వైరస్‌తో జ్వరంతో కూడిన దగ్గు కనిపిస్తుంది. చాలా మంది రోగులకు చాలా కాలం పాటు ఇటువంటి లక్షణాలు వెంటాడుతున్నాయి. రోగి కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు చాలా కాలంపాటు కొనసాగుతాయి. ఈ పరిస్థితి ప్రాణాపాయం కాదు, అయినప్పటికీ కొంతమంది రోగులు శ్వాసకోశ సమస్యల కారణంగా ఆసుపత్రులలో చేరవలసి వస్తుంది. కొన్ని లక్షణాలు కొవిడ్‌ను పోలి ఉంటాయి. అయితే రోగులు కొవిడ్‌కు ప్రతికూలంగా పరీక్షించారు. సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు అత్యధిక ప్రమాదంలో ఉన్నట్లు పరిగణించబడుతుంది.

అయినప్పటికీ 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు చాలా తరచుగా ఆసుపత్రిలో చేరుతున్నారని గుర్తించారు. 65 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి ప్రమాదంగా చెబుతున్నారు. ఆస్తమా రోగులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్ట్రోక్ రోగులు, నాడీ వ్యవస్థ, మెదడును ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్న వ్యక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. రక్త రుగ్మత ఉన్న వ్యక్తులు(సికిల్ సెల్ అనీమియా), ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా వుండాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరచాలనంతో సహా ఇతరులను తాకడం సరికాదు. బహిరంగంగా ఉమ్మివేయడం మానుకోండి. స్వీయ వైద్యం చేయవద్దు. యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు తీసుకునే ముందు మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి. కొంత కాలం పాటు భోజనం చేసేటప్పుడు, ఇతర సందర్భాల్లో గుంపులుగా కూర్చోవడం మానుకోవలని వైద్యులు సూచిస్తున్నారు. ఏదిఏమైనా వ్యక్తిగత శుభ్రత పాటించడం, సాధ్యమైనంత వరకు బయట దొరికే ఆహార పదార్థాలు తినకుండా ఉండడం, కాచిచల్లార్చిన నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News