Monday, December 23, 2024

పోలింగ్ కేంద్రాల వారీగా సమాచారం సేకరించాలి

- Advertisement -
- Advertisement -
  • అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించండి
  • ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు సూచన

గజ్వేల్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ల వారిగా పూర్తి సమాచారం ప్రతి అ ధికారి సేకరించాలని, ఈఆర్‌ఓలు ఫామ్6,7,8ల వివరాలను జాగ్రత్తగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి గజ్వేల్ ఐఓసిలోని ఆర్డీఓ ఛాంబర్‌లో తాహశీల్దార్లతో ఆ యన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గరుడ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో వివరాలు రెండింట్లో సమానంగా ఉండాలన్నారు. తహశీల్దార్లు ప్రతి రోజు క్షేత్ర పర్యటన చేయాలన్నారు. ఇంటింటికీ తిరిగి బిఎల్‌ఓలు ప్రతి ఓటరు వివరాలను సరిగ్గా నమోదు చేయాలన్నారు. వాటిని ఒకటికి రెండు సార్లు పరిశీలించాలన్నారు.

ఈఆర్‌ఓ,ఎఈఆర్‌ఓ,బిఆఎల్‌ఓలు సమన్వయంతో ఉండి విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. మరో సమావేశంలోపు అన్ని వివరాలు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆర్డీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన ఓటరు అవగాహన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటరు అవగాహన గురించి ప్రతి ఒకరికి క్లుప్తంగా వివరించాలన్నారు. సందర్శించిన వివరాలను పొందు పరిచేందుకుఒక రికార్డును పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ర్డీఓ విజయేందర్ రెడ్డి, వివిధ మండలాల తహశీల్దార్లు , బిఎల్‌ఓలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News