న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ) సలీల్ పరేఖ్ వార్షిక నికర వేతనం ఇప్పుడు రూ 71 కోట్లు అయింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ వేతన లెక్కలను స్టాక్ ఎక్సేంజ్‌కు సమర్పించిన పత్రాలలో చూపారు. ఇంతకు ముందు ఈ వేతనం 202021 సంవత్సరంలో రూ 49.68 కోట్లు ఉండేది. ఇప్పుడు దాదాపుగా 43 శాతం పెరుగుదల కన్పించింది. భారతదేశపు రెండో అతి పెద్ద ఐటి సేవల కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌కు పరేఖ్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్‌గా పునః నియమితులు అయ్యారు. ఈ పదవి కాలం మార్చి 2027 వరకూ ఐదేళ్లుగా సాగుతుంది. 2018 నుంచి ఆయన సిఇఒ బాధ్యతలలో ఉన్నారు. సిఇఒకు ఇతర కీలక స్థాయి ఉద్యోగులకు కంపెనీ షేర్లను కేటాయించడం జరుగుతుంది. ఇది వేతనంలో మినహాయించుకుంటారు. కంపెనీకి నందన్ నిలేకని అనధికారిక ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సేవలు అందిస్తున్నారు కానీ ఎటువంటి ప్రతిఫలం పొందడం లేదు.
ఇన్ఫోసిస్ సిఇఒ వేతనం రూ 71 కోట్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -