Friday, December 20, 2024

ఇన్ఫోసిస్ అదుర్స్

- Advertisement -
- Advertisement -

క్యూ4లో లాభం రూ.7,969 కోట్లు
గతేడాదితో పోలిస్తే 30 శాతం వృద్ధి
ఈక్విటీ షేరుకు డివిడెండ్ రూ.28

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం (202324) చివరి నాలుగో త్రైమాసికంలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.7,969 కోట్లతో 30 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.6,128 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ఆదాయం రూ.37,923 కోట్లతో 1.3 శాతం పెరిగింది. గతేడాదిలో ఈ ఆదాయం రూ.37,441 కోట్లుగా ఉంది. కరెన్సీలో కంపెనీ ఆదాయం అంచనా 1 నుంచి 3 శాతం వృద్ధి రేటును కంపెనీ అంచనా వేస్తోంది. 202324 ఆర్థిక సంవత్సరానికి మొత్తంగా చూస్తే ఇన్ఫోసిస్ నికర లాభం రూ.26,233 కోట్లతో 8.9 శాతం పెరిగింది. అంతకుముందు ఇది రూ.24,095 కోట్లుగా ఉంది. ఆపరేషన్స్ నుంచి వార్షిక ఆదాయం రూ.1,53,670 కోట్లతో 4.7 శాతం వృద్ధిని సాధించింది. అంతుకుముందు ఏడాదిలో ఈ ఆదాయం రూ.1,46,767 కోట్లుగా ఉంది.

2023-24 ఆర్థిక సంవత్సరాని ఈక్విటీకి షేరుకు రూ.20 చొప్పున డివిడెండ్, ప్రత్యేక డివిడెండ్ రూ.8 చొప్పున ఇన్ఫోసిస్ బోర్డు సిఫారసు చేసింది. కొద్ది రోజుల క్రితం టాటా గ్రూప్‌కు చెందిన టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ క్యూ4 ఫలితాలను విడుదల చేసింది. నాలుగో త్రైమాసికంలో టిసిఎస్ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ పరిస్థితిలో ఇన్ఫోసిస్ విజయాల ప్రభావం భారత మార్కెట్‌పై కూడా కనిపిస్తుందని భావిస్తున్నారు. కంపెనీ ఆర్థిక సేవలు, రిటైల్ వర్టికల్స్‌లో వృద్ధిలో క్షీణతను చూసింది. కానీ ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పరేఖ్ మాత్రం 202425లో ఆర్థిక సేవల్లో కంపెనీ మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా 254 బిలియన్ డాలర్ల ఐటి సెక్టార్ ఇటీవల కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఉద్యోగుల సంఖ్య తగ్గింది..
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 25,994 తగ్గిందని ఇన్ఫోసిస్ తెలిపింది. 2001 తర్వాత గత 23 ఏళ్లలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి. ఆర్థిక సంవత్సరం ముగింపులో కంపెనీ మొత్తం హెడ్‌కౌంట్ 317,240, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 7.5 శాతం తక్కువగా ఉంది. కంపెనీని విడిచిపెట్టే వ్యక్తుల అట్రిషన్ రేటు నాలుగో త్రైమాసికంలో 12.6 శాతానికి తగ్గింది, ఇది అంతకుముందు త్రైమాసికంలో 12.9 శాతంగా ఉంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడయ్యాయి. ట్రేడింగ్‌లో కంపెనీ షేరు 0.34 శాతం లాభంతో రూ.1419.25 వద్ద ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News