Monday, December 23, 2024

పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల పనులు పూర్తిచేయాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ కేంద్రాలలో కనీస మౌళిక సదుపాయాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్‌తో కలిసి జిల్లాలోని మున్సిపల్, వివిధ మండలాల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ నియమనిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసి సిద్ధం చేయాలన్నారు. విద్యుతు, సిసి కెమెరాలు, ఇతర మౌలిక వసతులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పూర్తి అయిన పనుల నివేదికను తెలుపాలని సూచించారు. ఏదైనా సమస్యలు ఉంటే తెలపాలని కోరారు. పట్టణాలలో మున్సిపల్ కమిషనర్లు, మండలాలలో మండల అభివృద్ధి అధికారులు పనులు పూర్తి చేసేందుకు ఎన్.ఆర్. ఈ. జి.ఎస్, జి.పి నిధుల ద్వారా పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఆయా పనులు వివరాలను బి.ఎల్.ఓల ద్వారా బి.ఎల్.ఓ యాప్‌లో ఈ నెలాఖరులోగా నివేదికలను పొందుపర్చాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీ.ఈ.ఓ రమాదేవి, ఆర్టీఓలు అలివేలు, నరసింహారావు, మున్సిపల్ కమీషనర్లు, విద్యుత్, పంచాయితీ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎలక్షన్ సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News