Monday, December 23, 2024

మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి

కీసర: నాగారం మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం 5వ వార్డు శివసాయి ఎన్‌క్లేవ్‌లో రూ.5 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు చైర్మన్ చంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో సిమెంట్ రోడ్లు, భూగర్భ మురుగు కాలువల నిర్మాణాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఇందుకు ఇటీవల రూ.3.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి అందరు సహకరించాలని చంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ అన్నంరాజు లావణ్య శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News