Wednesday, January 22, 2025

మౌలిక వసతులు కల్పించాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు చివరి దశలో ఉన్నందున ప్రాజెక్టు కోసం తాగునీటి సౌకర్యం, కరెంట్ సదుపాయం కల్పించాలని బుధవారం పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను కలిసి జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ కోరారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లకు తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఇందుకు మంత్రి కెటిఆర్ స్పందించి రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, సంబంధిత అధికారులకు నిధులు మంజూరు చేయాలని తెలిపారు. సానుకూలంగా స్పందించి మంత్రి కెటిఆర్‌కు ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంఎల్‌ఎ వెంట మున్సిపల్ చైర్మన్ గోళి శ్రీనివాస్, జగిత్యాల రూరల్ ఎంపిపి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News