Saturday, November 23, 2024

శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు ఆరంభం

- Advertisement -
- Advertisement -

Initiation of investigation into Srinagar encounter

శ్రీనగర్ : హైదర్‌పోరా హత్యాకాండపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశాలు వెలువడ్డాయి. సంబంధిత ఘటనపై ఎంక్వైరీ ఆఫీసర్‌గా కుర్షీద్ అహ్మద్ షాను నియమించారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనకు సంబంధించి దర్యాపును వెనువెంటనే విచారణాధికారి చేపట్టారు. సోమవారం శ్రీనగర్‌లోని హైదర్‌పోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. అయితే ఈ ఘటన వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో పౌరులు చనిపొయ్యారని నిరసనలు వ్యక్తం అయ్యాయి. వారు ఎటువంటి హింసాత్మక చర్యలతో సంబంధాలు లేవని వారి తరఫు బంధువులు వాపోతున్నారు. అయితే వీరికి ఉగ్రవాదుతో సంబంధాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలో సంబంధిత ఘటనపై దర్యాప్తు ఇప్పుడు ఆరంభం అయింది. ఘటనపై నివేదికను త్వరితగతిని అందించాల్సి ఉంటుందని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. దీనితో సంబంధిత ఘటనకు సంబంధించి వివరాలు తెలిసిన వారు పదిరోజులలోపల తమ వద్దకు రావచ్చునని అహ్మద్ షా ఓ ప్రకటన వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News