Monday, December 23, 2024

పిజి దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Initiation of PG dental admissions process

31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎండిఎస్ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్షా (నీట్) ఎండిఎస్ 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నిర్ధేశిత దరఖాస్తులను పూరించి సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.

సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం అర్హుల తుది జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది. అభ్యర్థులు https://tsmds.tsche.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధించి సాంకేతిక సమస్యలకు 9392685856, 7842542216, 9059672216 నెంబర్లకు, నిబంధనలు తెలుసుకునేందుకు 9490585796, 8500646769 నెంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫోన్ చేయవచ్చు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలకు కోసం కొరకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News