Friday, November 15, 2024

యాదాద్రిలో శివరాత్రి మహోత్సవాలకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : ప్రసిద్ది పుణ్యక్షేత్రము యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి కొండపై కొలువుదీరిన శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా శాస్రోక్త పూజలు స్వస్తివాచనముతో యజ్ఞబ్రహ్మ,ఆలయ సిధ్దాతి, అర్చకులు,పారాఁణికులు,పురోహితులు ఉత్సవ పూజలను శ్రీకారం చుట్టారు. బుధవారం శివాలయంలో 15 తేది నుండి 20 వతేదివరకు ఆరు రోజుల పాటూ తొలిసారి జరుగు ఉత్సవాలను శివాలయంలో ఉదయం శ్రీ స్మార్తాగమ ప్రకారం పాంచహ్నికదీక్షతో యజ్ఞబ్రహ్మ,సిధ్దాతి, ఆలయ అర్చకులు స్వస్తివాచనం,విఘ్నేశ్వరపూజ,శుద్ది పుణ్యహవాచనము,రక్షాబందనము పూజలు నిర్వహించి పారాయణికులకు దీక్ష వస్త్రలను అందచేశారు.

స్వస్తివాచనం..

లోకములోని సర్వవిరిన దోషములు తోలగి ఈశ్వర అనుగ్రహము వలన విశ్వశాంతి, లోకహితము కలగాలని స్వస్తివాచనమంత్రముతో పరమేశ్వరుని వేడుకోనుట ఈవేడుకలోని ప్రత్యేకత తెలిపారు.

విఘ్నేశ్వరారాధన..

ఉత్సవము యందు జరుగు సర్వకార్యక్రమములు నిర్విఘ్నముగా పరిసమాప్తి ఆగుటకు సకల విఘ్న వినాశకుడైన విఘ్నేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ వేడుక పూజను జరుపుట ప్రత్యకతగా తెలిపారు.

శుద్ది పుణ్యవాచనము..

ఉత్సవంలో ప్రతిద్ది శుధ్ది చేయుటకు వేదమంత్ర పఠనములతో పవిత్ర జలములతో పూజద్రవ్యలు,ఆలయ పరిసర ప్రాంతాలను సంప్రోక్షణ గావించుట శుద్దిపుణ్యహావచనముగా తెలిపారు.

రక్షాబందనము..

ఉత్సవ సమయంలో ఏటువంటి అంతరాయలు కలుకుండా ఉత్సవ దేవుడు శివపర్వతులకు, ఆలయ అర్చక, పండితులకు, ఆలయ సిబ్బందికి, భక్తులకు రక్షబందనము చేయుట ఈ పూజయేక్క విశిష్టతగా తెలిపారు.

ఉత్సవంలో సాయంత్రము..

ఉత్సవంలో భాగంగా శివాలయంలో సాయంత్రము నిత్యపూజల అనంతరము పారాఁణికులచే సమకచమక పారాయణములు,మంత్రపుష్ప పఠనములు,అంకురార్పోణము,సోమకుంభ,కలశస్థాపన, దేవతారాధన పూజలను గావించి తీర్ధప్రసాద వితరణ నిర్వహించారు. ఈ ఉత్సవ పూజల వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ్మమూర్తి,ఇన్చార్జి ఈవో రామకృష్ణరావు,ఉపకర్యానిర్వహణ అధికారి, అర్చకులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News