Sunday, December 22, 2024

సిఐటియు ఆధ్వర్యంలో మిడ్డే మీల్స్ వర్కర్స్ దీక్షలు

- Advertisement -
- Advertisement -

ములకలపల్లి : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మద్యాహ్న బోజన వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ముందు దీక్షలకు పూనుకున్నారు. సోమవారం మిడ్డె మీల్స్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు బుగ్గా వెంకట నర్సమ్మ ఆధ్వర్యంలో వర్కర్స్ దీక్షలను చేపట్టగా ఈ దీక్షలను సిఐటియు మండల కార్యధర్శి నిమ్మల మదు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మిడ్డె మీల్స్ వర్కర్స్‌కు నెలకు కేవలం వెయ్యి రూపాయిలు ఇస్తూ వారితో వెట్టి చాకిరి చేయించడం దారనమన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలలో అదనంగా రూ.2000లను పెచుతున్నామని చెప్పి నెలలు గడుస్తున్న నేటి వరకు జివోను విడుదల చేయలేదన్నారు.ప్రభుత్వం మద్యాహ్న బోజన పధకానికి కేవలం బియ్యం ఇచ్చి కూరగాయలు,ఇతర సామాగ్రిని వర్కర్స్ కొనుగోలు చేసి పధకాన్ని సక్రమంగా నడపమంటే ఎలా సాద్యపడుతుందని ఆయన ప్రశ్నించారు. ఒక్కో విద్యార్ధికి రోజుకు 5-.45 పైసలు ఇచ్చి వారంలో 3 రోజులు కోడి గుడ్లు పెట్టమంటే ఎలా సాధ్యపడుతుందని ఆయన ప్రశ్నించారు.నేడు మార్కెట్‌లో అన్ని రకాల నిత్యావసర ధరలు పెరిగి ఏమి కొనలేని పరిస్థితి ఉందన్నారు.

అప్పులు చేసి మద్యాహ్న బోజన పధకాన్ని కొనసాగిస్తున్న వర్కర్స్‌కు వంట బిల్లులను ప్రభుత్వం నెల నెల చెల్లించ కుండా కాలయాపన చేయడం వలన వ్యాపారస్తులు అప్పులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పదంతో ఆలోచించి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలను ఇవ్వడంతో పాటు వంట వండటానికి ఉచితంగా వంట గ్యాస్‌ను ఇవ్వాలని నిమ్మల మదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.మొదటి రోజు దీక్షలలో పద్దం తిరుపతమ్మ,తేజావత్ క్రాంతి,కీసరి సుజాత,కారం రాములమ్మ,పాకనాటి సీతా,సంగం అంజెమ్మ,తదితరులు పాల్గొన్నారు.ఈ దీక్షలను జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీన్ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించి తమ మద్దతును ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News