Monday, December 23, 2024

ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలి

- Advertisement -
- Advertisement -
నూతనంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, గురుకుల విద్యా సంస్ధల కార్యదర్శి నికోలస్‌కు
మంత్రి సత్యవతి రాథోడ్ సూచనలు

హైదరాబాద్: ములుగు జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠి ఆదివారం బంజారాహిల్స్‌లోని మంత్రులు నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి ఇలా త్రిపాఠికి పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని, ఉద్యోగ విధుల నిర్వహణలో ప్రజల మెప్పు పొందాలని జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాలతో మంత్రి కొద్దిసేపు జిల్లాలోని సమస్యలపై చర్చించారు. అదే విధంగా గురుకుల విద్యా సంస్ధల సొసైటీ కార్యదర్శిగా నూతనంగా నియామకమైన నవీన్ నికోలస్ మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మంత్రి పుష్పగుచ్చం అందజేసి నవీన్ నికోలస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News