- Advertisement -
ఖమ్మం: వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మంకు వెళ్లిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎడమ కాలికి స్పల్ప గాయాలయ్యాయి. ఆయన ఖమ్మంలో ఉదయం 7 గంటల నుంచి జలగం నగర్, కెబి నగర్, టెంపుల్ సిటీ, నాయుడు పేట ప్రాంతాల్లోని వరద ముంపు బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో బాధితులను పరామర్శించడానికి టూ వీలర్ పై వెళ్లారు. అయితే కాలనీలో టూవీలర్ స్కిడ్ కావడంతో జారి పడ్డారు. వెంటనే ఆయనను భద్రతా సిబ్బంది క్యాంప్ ఆఫీసుకు తరలించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఆయనకు చికిత్స చేశారు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
- Advertisement -