Monday, January 20, 2025

తండ్రి వైద్యం కోసం 50 కిలోమీటర్లు రిక్షా తొక్కి…

- Advertisement -
- Advertisement -

వెబ్ డెస్క్: గాయపడిన తన ండ్రికి చికిత్స కోసం ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక తన తండ్రిని వెనుక కూర్చోపెట్టుకుని 50 కిలోమీటర్లు రిక్షా తొక్కింది. ఈ హృదయావిదారక ఘటన ఒడిశాలోని భద్రతక్ జిల్లాలో చోటుచేసుకుంది. అందుబాటులో అంబులెన్సు లేక, ప్రైవేట్ వాహనాన్ని కుదుర్చుకోవడాఇకి చేతిలో డబ్బుల్లేక ఆ పేర బాలిక తన తండ్రిని తీసుకుని రిక్షా తొకుతూ వెళుతుతన్న దృశ్యం గురువారం కొందరు సానికుల కంటపడడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది.

భద్రతక్ జిల్లా ప్రధాన కార్యాలయం ఆసుపత్రి(డిహెచ్‌హెచ్)కు 35 కిలోమీటర్ల దూరంలోని నదిగన్ గ్రామంలో నివసించే సుజాఆ సేథి స్వగ్రామానికి వాపసు వెళుతుండగా భద్రక్ పట్టణనంలోని మహతబ్ ఛక్ సమీపంలో కొందరు స్థానికుల కంటపడింది. వారు ఆమెను పలకరించగా తన కష్టాల పర్వాన్ని ఆమె వారికి వివరించింది.

అక్టోబర్ 22న గ్రామంలో రిగిన ఘర్షణలో గాయపడిన న తండ్రి సంభునాథకు చికిత్స చేయించడానికి రిక్షాలో ఆమె 14 కిలోమీటర్ల దూరంలోఇ ధామ్‌నగర్ ఆసుప్రికి ఈసుకెళ్లింది. అయితే డాక్టర్ల సలహా మేరకు మరుసటి నాడు 35 కిలోమీటర్ల దూరంలోని భద్రక్ ప్రభుత్వ ఆసుపత్రికి రిక్షాలో తీసుకెళ్లింది. వచ్చే వారం మీ నాన్నకు ఆపరేషన్ చేస్తాము..వారం తర్వా రావాలంటూ ఆమెకు భద్రక్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. దీంతో ఆమె తండ్రిని వెంటపెట్టుకుని రిక్షాలో వెనుదిరిగింది.

గ్రామానికి బయల్దేరిన సు.జాత రెండు కిలోమీటర్ల దూరంలో కొందరు జర్నలిస్టుల కంటపడింది. వారు ఆమెను ఆపి పరిస్తితి తెలుసుకున్నారు. వెంటనే భద్రక్ జిల్లా ప్రధాన వైద్యాధికారికి ఫోన్ చేసి అంబులెన్సు పంపాలని వారు కోరగా రోగిని ఇంటికి పంపడానికి నిబంధనలు ఒప్పుకోవని సమాధాం ఇచ్చాడు.

ఇంతలో విషయం తెలుసుకున్న భద్రక్ ఎమ్మెల్యే మల్లిక్, ధామ్‌గర్ మాఈ ఎమ్మెల్యే దాస్ అక్కడకు చేరుకునారు. వారి ఆదేశం మేరకు భద్రక్ సిడిఎంఓ వెంటనే అంబులెన్సు ఏర్పాటు చేసి రోగిని హాస్పిటల్‌కు తరలించారు. ఆపరేషన్ పూర్తయి రోగి కోలుకునే వరకు హాస్పిటల్‌లోనే ఉండేందుకు వసతి కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News