Monday, November 18, 2024

దక్షిణ కొరియా ప్రతి పక్షనేత లీజే మ్యూంగ్‌పై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

సియోల్ : దక్షిణ కొరియా ప్రతిపక్షనేత లీ జే మ్యూంగ్‌పై మంగళవారం గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆగ్నేయ దిశలో ఉన్న బుసన్ నగరంలో లీ జే మ్యూంగ్ పర్యటిస్తుండగా, దుండగుడు కత్తితో మెడపై పొడిచినట్టు పోలీస్‌లు వెల్లడించారు. 59 ఏళ్ల లీ జే మ్యూంగ్ ప్రధాన ప్రతిపక్షం డెమొక్రాటిక్ పార్టీ నేత. ఈ సంఘటన జరిగిన వెంటనే బుసాన్‌లో అత్యవసర వైద్యం అందించిన తరువాత సర్జరీ కోసం విమానంలో సియోల్ ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగినా ఆయన స్పృహ లోనే ఉన్నారని, క్లిష్టమైన పరిస్థితి కాదని , అయితే ప్రస్తుత వాస్తవ పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని పోలీస్‌లు చెప్పారు..

బుసాన్ నగరంలో కొత్త విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా ఈ దాడి జరిగింది. దుండగుడు ఆటోగ్రాఫ్ కావాలన్న నెపంతో లీజే మ్యూంగ్ దగ్గరకు వెళ్లి మెడపై ఎడమ భాగంలో కత్తితో దాడి చేశాడని బుసాన్ పోలీస్ ఆఫీసర్ సోహ్న్ జే హాన్ మీడియాకు చెప్పారు. 67 ఏళ్ల దుండగుడ్ని పోలీస్‌లు అక్కడికక్కడే అదుపు లోకి తీసుకున్నారు. ఇది ఉగ్రవాదుల దాడిగా డెమోక్రాటిక్ పార్టీ పేర్కొంది. దాడికి కారణాలేమిటో ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News