Saturday, January 25, 2025

గాయంతో జకోవిచ్ ఔట్

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్ (ఇటలీ), రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ) ఫైనల్‌కు చేరుకున్నాడు. ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) సెమీస్ పోరు అర్ధాంతరంగా నిష్క్రమించాడు. జ్వరేవ్‌తో జరిగిన సెమీస్ సమరంలో జకోవిచ్ గాయానికి గురయ్యాడు. దీంతో అతను మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అప్పటికీ జ్వరేవ్ 76 ఆధిక్యంలో ఉన్నాడు. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇటు జ్వరేవ్ అటు జకోవిచ్ సర్వం ఒడ్డి పోరాడారు.దీంతో పోరులో హోరాహోరీ తప్పలేదు. ఇద్దరు అసాధారణ ఆటను కనబరచడంతో పోరు యుద్ధాన్ని తలపించింది. ఇద్దరి మధ్య ఆధిపత్యం తరచూ చేతులు మారుతూ వచ్చింది. అయితే జ్వరేవ్ మాత్రం చివరి వరకు నిలకడగా ఆడుతూ సెట్‌ను దక్కించుకున్నాడు.

కానీ రెండో సెట్ ఆరంభానికి ముందు జకోవిచ్ గాయం తిరగబడింది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో ప్రత్యర్థి జ్వరేవ్‌కు వాకోవర్ ఇచ్చాడు. దీంతో జ్వరేవ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు రెండో సెమీస్‌లో సిన్నర్ అలవోక విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు.అమెరికాకు చెందిన 21వ సీడ్ బెన్ షెల్టన్‌తో జరిగిన పోరులో సిన్నర్ 76, 62, 62తో షెల్టన్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో సిన్నర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ సెట్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. ఇందులో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన సిన్నర్ సెట్‌ను దక్కించుకున్నాడు. ఇక తర్వాతి రెండు సెట్లలో సిన్నర్‌కు ప్రత్యర్థి నుంచి ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సిన్నర్ అలవోక విజయంతో ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. సిన్నర్ కిందటిసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News