Friday, December 27, 2024

కాంగ్రెస్ పాలనలో పేదలకు అన్యాయం

- Advertisement -
- Advertisement -

కాటారం : ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదల సొంతింటి కళను కాంగ్రేసోళ్లు చిధిమేశారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ అన్నారు. శనివారం కాటారం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్‌వాడ గ్రామంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. మంథని ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విప్‌గా ఉన్న సమయంలో రాష్ట్రంలోను ఇందిరమ్మ ఇండ్ల అవినీతి మంథని నియోజకవర్గంలోనే జరిగిందని విమర్శించారు. రికార్డుల్లో పేదల పేరుతో బిల్లులు తీసుకుని ఇండ్లు కట్టించకుండా కాంగెస్ నాయకులు బంగ్లాలు కట్టుకున్నారని అన్నారు.

ఇందిరమ్మ పథకంలో మంథనిలో అవినీతికి సాక్షం శ్రీధర్‌బాబు స్వంత గ్రామం ధన్‌వాడలో ఉన్న పూరిగుడిసెలే సాక్షమని జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీహర్షిణీ అన్నారు. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించారని అనంతరం అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసే విషయంలో కేసీఆర్ గొప్పగా ఆలోచన చేశారని, ఈ అవినీతిలో అమాయకులైన లభ్ధిదారులపై కేసులు నమోదు చేయాల్సి వస్తుందని గమనించి కేసులు పెట్టన ఘనత కేసీఆర్‌కు దక్కిందన్నారు.

కాంగ్రెస్ పాలనలో తండ్రీ, కొడుకులు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు వచ్చే నాయకులను నమ్మవద్దని అన్నారు. ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలను పట్టించుకునే పుట్ట మధూకర్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కు రాకేష్, బిఆర్‌ఎస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు తోట జనార్ధన్, యూత్ మంథని నియోజకవర్గ అధ్యక్షుడు భూపెల్లి రాజు, మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ళ కిరణ్, చక్రి, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News