- Advertisement -
చండీగఢ్ : హర్యానాలో ఆదివారం సాయంత్రం ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌డిఎల్) నేత నఫే సింగ్ రాథే హత్య జరిగింది. జాజ్జార్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన రాథే హర్యానా ఐఎన్‌డిఎల్ రాష్ట్ర విభాగం అధ్యక్షులుగా ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే కూడా అయిన రాథే తన ఎస్‌యువిలో ప్రయాణిస్తూ ఉండగా దుండగులు కారులోనే ఉండి ఆయనపై బహద్దూర్‌ఘర్ పట్టణం వద్ద లోపలనే గట్టిగా పట్టుకుని కాల్పులు జరిపినట్లు ఐఎన్‌ఎల్‌డి వర్గాలు తెలిపాయి. ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందో తెలుస్తోందని రాష్ట్ర ఐఎన్‌ఎల్‌డి నేత అభయ్ చౌతాలా విమర్శించారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఎన్నిసార్లు తెలిపినా అధికారులు పట్టించుకోలేదని, ఇప్పుడీ ఘోరం జరిగిందని, ఇందుకు బాధ్యత వహిస్తూ సిఎం, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- Advertisement -