Wednesday, January 22, 2025

ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్దికి వినూత్న ప్రణాళికలు రూపొందించనున్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. రాజేంద్రనగర్‌లో ఈ నెల 16నుంచి 18వరకూ అఖిల భారత సమన్వయ పరిశోధనా విభాగం ఆగ్రోఫారెస్ట్రీ వార్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగే ఈ మూడు రోజుల సమావేశాల్లో ఆగ్రోఫారెస్ట్రీ అభివృద్ధికి సబంధించిన వివిధ అంశాలపైన చర్చాగోష్టిలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఈ సమావేశాలకు ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.ఎస్.కె చౌదరి ముఖ్యఅతిధిగా హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 70మంది శాస్త్రవేత్తలు ,ఐసిఏఆర్, ఆగ్రోఫారెస్ట్రీ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నట్టు వివరించారు. గత ఏడాది కాలంగాచేపట్టిన పరిశోధనా కార్యక్రమాలు ,భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించి ,స్థిరమైన ,అధిక లాభాలనిచ్చే వాతావరణ అనుకూల ఆగ్రోఫారెస్ట్రీ నమూనాలను రూపొందించటం జరగుతుందని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News