మన తెలంగాణ,సిటీబ్యూరో: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో సరికొత్త ఆవిష్కరణకు అవకాశం కల్పిస్తుందని, దీని ద్వారా ప్రతి ఒకరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని దాని బయటకు తీసేందుకు వేదిక ఉండాలన్న ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని కలెక్టర్ శర్మణ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో జిల్లా నుంచి రాష్ట్ర స్దాయిలో ఎంపికైన ఐదుగురికి ప్రశంసా పత్రాలు అందజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణలను తయారు చేయాలని ఆకాంక్షించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.రోహిణి, జిల్లా సైన్సు అధికారి ధర్మేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపిక ఇన్నోవేటర్లు:
రవికర్ రెడ్డి: శరీర గాయాలను నివారించడానికి రోగులను సులభంగా పైకి లేపడం,బదిలీ చేయడం
యశ్విన్: ప్రమాద సమయంలో బైక్ డ్రైవర్లకు తీవ్ర గాయాలను నివారించడానికి ఎయిర్‌బ్యాగ్ మెకానిజం
శ్రీనివాస్: మెకానిక్ బ్యాటరీలు
గౌతమ్: సోలార్ ప్యానెల్ ద్వారా ప్లగ్ అండ్ ప్లే ఎసి పవర్ జనరేషన్
సాఫియా బేగం, పద్మజా: ట్రక్కు డైవర్లు తమ పల్స్‌రేటు మీద అప్రమత్తం చేయడానికి స్మార్ట్ గ్లౌవ్స్
ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -