ములుగు: ఆగస్టు 5 వరకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వివరాలు పంపాలని కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య, ఐటిడిఏ పిఓ అంకిత్, ఓఎస్‌డి అశోక్ కుమార్, జడ్పిటిసి పాయం రమణ, హరిబాబులతో కలిసి ఇంటింటా ఇన్నోవేటర్ 2023 సంవత్సరానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఔత్సాహికులు ఆవిష్కరణలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవ త్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు.
రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్య్రం దినోత్సవ వేడుకల సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నాయని, ఈ ప్రదర్శన జిల్లా స్థాయిలో స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలలో భాగంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరు గుతుందని, గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, వ్యవసాయరంగ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు మొదలైనవి అంగీకరించబడతాయని కలెక్టర్ తెలిపారు. ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ఆగష్టు 5 అని, అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి షార్ట్‌లిస్టు తర్వాత 5 ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేయబడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ కె రమాదేవి, కలెక్టరేట్ కార్యాలయ ఏఓ విజయభాస్కర్, ఐటిడిఏ ఏడిడి పోచం, డిపిఆర్‌ఓ రఫిక్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, టిఎస్‌ఐసి కోఆర్డినేటర్ గణేష్, తదితరులు పాల్గొన్నారు.