Monday, December 23, 2024

ఇనార్బిట్‌ దుర్గం చెరువు 2023 పవర్డ్‌ బై ఆల్ట్‌ లైఫ్‌ ఓన్లీ ఎట్‌ షాపర్స్‌ స్టాప్‌..

- Advertisement -
- Advertisement -

మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ (ఐడీసీఆర్‌) 2023 మూడవ ఎడిషన్‌ ను జనవరి 29, 2023న నిర్వహించడానికి ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. పెర్‌ఫార్మెన్స్‌, అథ్లీజర్‌ అప్పెరల్‌ బ్రాండ్‌ ఆల్ట్‌లైఫ్‌ ఓన్లీ ఎట్‌ షాపర్స్‌ స్టాప్‌ దీనికి తగిన మద్దతు అందిస్తుంది. ఈ నూతన భాగస్వామ్యంలో భాగంగా నమోదిత అభ్యర్థులకు 1499 రూపాయల విలువ కలిగిన ఆల్ట్‌లైఫ్‌ టీషర్ట్‌ను మరియు 3వేల రూపాయల విలువ కలిగిన గిఫ్ట్‌ ఓచర్లను బహుమతిగా అందజేస్తుంది.

ఐడీసీఆర్‌ 2023 కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం రన్నర్లు 899 రూపాయలు చెల్లించి 5 కిలోమీటర్లు, 1399 రూపాయలు చెల్లించి 10 కిలోమీటర్లు, 1699 రూపాయలు చెల్లించి 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌లో పాల్గొనవచ్చు. ఇన్‌ రివార్డ్స్‌ సభ్యులు రిజిస్ట్రేషన్‌ ఫీజుపై 150 రూపాయల రాయితీ పొందవచ్చు. అన్ని వయసుల వారూ ఈ రన్స్‌లో పాల్గొనవచ్చు.

ఈ రన్స్‌ ఇనార్బిల్‌ మాల్‌, హైదరాబాద్‌ వద్ద ప్రారంభమై, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌ మీదగా హైదరాబాద్‌లో అత్యంత అందమైన ల్యాండ్‌మార్క్‌ ద్వారా జరుగుతాయి. ఈ మారథాన్‌ను ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ మేనేజ్‌ చేస్తుంది. ఈ రన్స్‌ ద్వారా సమీకరించిన మొత్తాలను దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే నైపుణ్యాభివృద్ది శిక్షణకు అందించనున్నారు. ఈ రన్‌కు కాజ్‌ పార్టనర్‌గా నిర్మాణ్‌ డాట్‌ ఓఆర్‌జీ వ్యవహరిస్తుండగా, కమల్‌ వాచ్‌ కో టైమింగ్‌ పార్టనర్‌గా, లిమ్కా స్పోర్ట్జ్‌ హైడ్రేషన్‌ భాగస్వామిగా, రేడియో పార్టనర్‌గా ఫీవర్‌ ఎఫ్‌ఎం వ్యవహరిస్తున్నాయి.

షాపర్స్‌స్టాప్‌ వద్ద కస్టమర్‌ కేర్‌ అసోసియేట్‌, చీఫ్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీసర్‌ శ్వేతల్‌ బసు మాట్లాడుతూ ‘‘ఐడీసీఆర్‌ 2023తో ఆల్ట్‌ లైఫ్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆరోగ్యం పట్ల అవగాహన గణనీయంగా పెరుగుతుంది. ఫిట్‌నెస్‌ పెంచుకోవడానికి ప్రయత్నించే వారికి ఇది ఓ చక్కటి అవకాశంగా నిలుస్తుంది. జనవరి 29న జరిగే ఈ రన్‌ పూర్తి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News