Wednesday, January 22, 2025

ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2024 జెర్సీ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇనార్బిట్ మాల్ సైబరాబాద్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, ది వెస్టిన్, మాదాపూర్ భాగస్వామ్యంతో త్వరలో నిర్వహించబోనున్న భారీ కార్యక్రమం, ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (IDCR) 2024 కోసం అధికారిక జెర్సీ, రేస్ రూట్, రేస్ మెడల్, ఛారిటీ బిబ్‌లను ఈరోజు ఆవిష్కరించింది. ఈ కార్యక్రమం లో శ్రీ డాక్టర్ జి వినీత్, ఐపిఎస్, డిసిపి, మాదాపూర్, టి శ్రీనివాసరావు, ఐపిఎస్, డిసిపి ట్రాఫిక్ తో పాటు సృజన, IPS, DCP ఉమెన్ సేఫ్టీ, శ్రవణ్ గొనె , COO, K రహేజా కార్ప్, శరత్ బెలవాడి, సెంటర్ హెడ్, ఇనార్బిట్ మాల్ హైదరాబాద్, మయూర్, వ్యవస్థాపకుడు & సీఈఓ, Nirmaan.Org. సహా ప్రముఖులు హాజరయ్యారు.

జనవరి 28, 2024న ఈ రన్ జరుగనుంది, ఈ 4వ ఎడిషన్‌ రన్ లో దేశవ్యాప్తంగా ఉన్న రన్నర్లు 21 కిమీ, 10 కిమీ, 5 కిమీల మూడు విభాగాలలో పోటీపడతారు.

Nirmaan.Org ఈ సంవత్సరం CSR భాగస్వామిగా కొనసాగుతుంది, బిజినెస్ పార్క్ పార్టనర్ గా మైండ్‌స్పేస్, హాస్పిటాలిటీ పార్టనర్‌గా ది వెస్టిన్ వ్యవహరిస్తుంది. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్‌ నుండి ప్రారంభమయ్యే ఈ రన్ మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ వద్ద ముగిసే ముందు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు సరస్సు, సైబరాబాద్‌లోని అనేక ఇతర అందమైన ప్రదేశాల ద్వారా సాగుతుంది.

“LGBTQ+ కమ్యూనిటీకి చెందిన సభ్యులతో పాటు ఈ రన్ లో దాదాపు 100 మంది దివ్యాంగులు కూడా పాల్గొంటారు. మొత్తం బహుమతి రూ.6 లక్షలు కాగా, వివిధ విభాగాల్లోని 48 మంది రన్నర్‌లకు ఇది అందించబడుతుంది. ఈ పరుగులో పాల్గొనేందుకు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 21, 2024. దాదాపు 6500 మంది ఈ రన్ లో పాల్గొనే అవకాశం ఉంది” అని ఇనార్బిట్ మాల్ హైదరాబాద్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి తెలిపారు.

“IDCR చాలా బలమైన కారణం రన్ ఫర్ ఇంక్లూజన్ తో అనుబంధించబడింది. దివ్యాంగులు (పిడబ్ల్యుడిలు), బాలికలు, మహిళలు, ఎల్‌జిబిటిక్యూ+ వ్యక్తులకు విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను పొందేందుకు సహాయం చేయడానికి నిధులను సేకరించడం ఈ రన్ లక్ష్యం. ఛారిటీ & కార్పొరేట్ భాగస్వామ్యం ద్వారా ఇప్పటివరకు రూ. 99 లక్షలు సేకరించబడ్డాయి, ఇప్పటివరకు 502 మంది లబ్ధిదారులకు మద్దతు అందించటం జరిగింది” అని నిర్మాన్ ఓ ఆర్ జి వ్యవస్థాపకుడు & సీఈఓ మయూర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News