Friday, January 24, 2025

ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని ప్రదర్శించిన ఇనార్బిట్ మాల్ హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

నిస్సాన్ నేతృత్వంలో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో కప్ ను ప్రదర్శించారు. ట్రోఫీని దగ్గర నుంచి చూసి, దానితో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. నిస్సాన్ కూడా ఒక ప్రత్యేకమైన పోటీ #catchthematchwithnissanతో ప్రేక్షకులతో సరదాగా నిర్వహించింది. ఇందులో వినియోగదారులు ICC ప్రపంచ కప్ టిక్కెట్‌లను గెలుచుకునే అవకాశం అందించింది.

“ప్రతిష్టాత్మకమైన ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీని మా మాల్‌కు స్వాగతిస్తున్నందుకు మేము థ్రిల్‌గా ఉన్నాము. టీమ్ ఇండియా మ్యాచ్‌ల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము. హైదరాబాద్‌లోని మా ప్రాంగణంలో ట్రోఫీని ప్రదర్శించినందున మా అభిమానులు ఆనందాన్ని పొందారని మేము భావిస్తున్నాము” అని ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌, సెంటర్ హెడ్ శరత్ బెలవాడి తెలిపారు.

శ్రావణ్ గొనె, సిఓఓ K రహేజా కార్ప్, హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌ మాల్‌ సెంటర్‌ హెడ్‌ శరత్‌ బెలవాడి, నగర పోలీసు అధికారులు ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News