Saturday, November 23, 2024

రాష్ట్రంలోనే మొదటిసారి ఇన్‌పుట్ సబ్సిడీ

- Advertisement -
- Advertisement -
  • రూ. 2.7 కోట్ల విలువైన చెక్కులను అందించిన ఎమ్మెల్యే పెద్ది

చెన్నారావుపేట: రాష్ట్రంలో మొట్టమొదటిసరిగా ఇన్‌పుడ్ సబ్సిడీ ద్వారా నష్టపోయిన రైతులకు చెక్కుల ద్వారా ఆర్థికసాయం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం చెన్నారావుపేట మండలం అమీనాబాద్ క్లస్టర్ గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న 2066 ఎకరాల్లో నష్టపోయిన 2248 మంది రైతులకు రూ. 2.7 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి బాధిత రైతులకు ఒక్కొక్కరికి రూ. 10 చొప్పున అందచేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2023 జనవరి నెలలో నర్సంపేట నియోజకవర్గంలో ఆకస్మికంగా కురిసిన వడగండ్ల వానకు నర్సంపేట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడం జరిగింది. జరిగిన పంట నష్టానికి సంబంధించి సీఎం కేసీఆర్ విన్నవించగా సీఎం స్వయంగా 101 డిగ్రీ జ్వరంతో ఉన్నప్పటికీ అధికార యంత్రాంగంతో నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించి పంటను కోల్పోయిన రైతుల కన్నీళ్లను తుడిచి ఓదార్చారు. 2013లో వడగళ్ల వాన పడ్డపుడు అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ ఇంత వరకు నెరవేర్చలేకపోయారు.

నియోజకవర్గంలో 42 వేల పైచిలుకు ఎకరాల పంట నష్టం కాగా రూ. 42 కోట్ల నిధులు విడుదలయ్యాయి. రైతులకు ఇచ్చిన హామీ మేరకు మంగళవారం నర్సంపేట నియోజకవర్గంలో ఇన్‌పుడ్ సబ్సిడీ(నష్టపరిహారం) చెక్కులను అందించే ప్రక్రియ కొనసాగుతుంది. అందులో భాగంగా చెన్నారావుపేట మండలానికి రూ. 6 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కాగా అమీనాబాద్ క్లస్టర్‌లోని అమీనాబాద్, పనికర, దీక్షకుంట, అమీన్‌పేట, ఖాదర్‌పేట, సూర్యాపేటతండా, గొల్లభామతండా, గొల్లపల్లి, పత్తినాయక్‌తండా, శంకరంతండా, బాపునగర్, కందిగడ్డ తండా గ్రామాల్లో 2066 ఎకరాల్లో పంట నష్టపోగా, 2248 బాధిత రైతులకు రూ. 2.06 కోట్ల చెక్కులను ఎమ్మెల్యే అందచేశారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావు, మండల పార్టీ కన్వీనర్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జడ్పీటీసీ పత్తినాయక్, జిల్లా కోఆప్షన్ ఎండీ రఫీ, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, మాజీ ఎంపీపీలు జక్క అశోక్, కేతిడి వీరారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్, అమీనాబాద్ సొసైటీ ఛైర్మన్ మురహరి రవి, రాంరెడ్డి, తూటి శ్రీనివాస్, కుండె మల్లయ్య, ప్రదీప్, అమ్మ రాజేష్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News