Wednesday, January 22, 2025

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ

- Advertisement -
- Advertisement -

లింగాల ఘనపురం : మండలంలోని నెల్లుట్ల పంచాయతీ కార్యాలయలంలో నిధుల గోల్‌మాల్ జరిగిందంటూ వార్డు సభ్యులు గడ్డం యాకమ్మ, డికొండ రాజు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి మంగళవారం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని రికార్డులను పరి శీలి ంచారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పాటు సర్పంచ్ చిట్ల స్వరూపారాణి భూపాల్‌రెడ్డి ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమగ్ర విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమగ్ర విచారణ చేయకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
వార్డు సభ్యులు గడ్డం యాకమ్మ , డికొండ రాజు
నెల్లుట్ల గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఉన్న తాధికారులు తగిన చర్యలు చేపట్టాలి. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్ర యిస్తాం. స్థానిక సర్పంచ్ చిట్ల స్వరూపారాణి భూపాల్ రెడ్డి 2019 నుంచి 2011 సంవత్సరం వరకు తప్పడు బిల్లులు సృష్టించి నిధులు కాజేసిన విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. గతంలో 2022లో విచా రణ జరిపిన జిల్లా పంచాయతీ అధికారి కలెక్టర్‌కు నివేదించారు. ఆ తర్వాత మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఆర్‌టిఐతో సమాచారం సేకరించిన ఫలితం లేకపోవడంతో మళ్ళీ ప్రజావాణిలో దరఖాస్తు చేశాం. మరలా జిల్లా పంచాయతీ అధికారి మంగళవారం పంచాయతీ కార్యా లయానికి వచ్చి తూతూ మంత్రంగా విచారణ జరిపారు. ఇప్పటికైనా తగిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News