మనతెలంగాణ/హైదరాబాద్: చారిత్రక కట్టడాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని గురువారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చారిత్రక కట్టడాల అభివృద్ధిపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈనెల 22లోగా కమిటీ మొదటి సమావేశం జరగాలని, చారిత్రక కట్టడాల అభివృద్ధికి ఖచ్చితమైన బ్లూ ప్రింట్ రూపొందించాలని హైకోర్టు తెలిపింది. గోల్కొండ, కుతుబ్ షాహీ టుంబ్స్ దెబ్బతిన్నాయన్న పత్రికా కథనాలపై హైకోర్టులో విచారణ జరగగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 12న నివేదికలు సమర్పించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్త్తం చేసింది. విచారణకు ఉందనగా చివరి నిమిషంలో నివేదికలు ఇవ్వడం బాధ్యతా రహితమని హైకోర్టు తెలిపింది. ఇక రాష్ట్రంలో 27 చారిత్రక కట్టడాలు ఉన్నాయని తెలిపిన పురావస్తు శాఖ, గోల్కొండ పరిసరాల్లో 151 అక్రమ నిర్మాణాలు వెలిశాయని హైకోర్టుకు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ తెలిపారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎఎస్జి తెలిపింది. అయితే అక్రమణల తొలగింపు, రోడ్లు, విద్యుత్ అభివృద్ధి కూడా ప్రణాళికలో ఉండాలన్న హైకోర్టు కమిటీ సమావేశాలు, నిర్ణయాలపై నివేదిక సమర్పించాలని పురావస్తు శాఖ కార్యదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణ జూన్ 10కి వాయిదా వేసింది.
చారిత్రక కట్టడాలపై హైకోర్టులో విచారణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -