Monday, December 23, 2024

ఎక్కడో లెక్క తప్పింది

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో లోపం
ఎక్కడుంది.. ఏం జరిగిందనే విషయం
తెలుసుకుంటాం ఎవరి ప్రమేయమైనా
ఉందా అన్న అంశాన్ని పరిశీలిస్తాం
నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు
పిలుస్తాం బ్యారేజీలపై నిజాయితీగా
సమాచారం ఇవ్వండి 25లోగా సంబంధిత
ఇంజినీర్లు అఫిడవిట్లు సమర్పించాలి
విచారణ సందర్భంగా జస్టిస్ ఘోష్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంలోని బ్యారేజీల విషయం లో నిజాయితీగా స్వేచ్చగా తమ అభిప్రాయాలు తెలపాలని జస్టిస్ పి.సి ఘోస్ సంబంధిత ఇంజనీర్ల ను ఆదేశించారు. తన విచారణ లో వెల్లడించిన విషయాలను , అ భిప్రాయాలను ఈ నెల 25లోపు అఫిడవిట్ల రూపంలో సమర్పించాలన్నారు. గోదావరి నదిపై ని ర్మించిన మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవ టం, ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు బుంగలు పడటం నీటి లీకేజిలు, బ్యారేజిల డిజైన్లు ,ఉన్నత స్థాయి కమిటి నిర్ణయాలు, ప్రాజెక్టు నిర్మాణం సందర్బంగా అంచనాల పెంపుదల తదితర అంశాలకు సంబంధించి నిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపిస్తోంది.ఈ నేపద్యంలో విచారణ ప్రక్రియలో భాగంగా మేడిగడ్డ సహా కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఇంజనీర్లు అందరూ అఫిడవిట్లు దాఖలు చేయాలని విచారణ కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు.

విచారణ ప్రక్రియలో భాగంగా కమిషన్ ముందు మంగళవారం నీటిపారుదల శాఖకు చెందిన 20 మందికి పైగా ఇంజినీర్లు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణం, నాణ్యతా నిర్వహణ, డ్యాం సేఫ్టీ ఇంజినీర్లు ఇందులో ఉన్నారు. డిజైన్లు, అధ్యయనాలు, గమనించిన అంశాలు, తీసుకున్న చర్యలు, తదితరాల గురించి ఇంజినీర్లను విచారణ చేశారు. కమిషన్ ముందు చెప్పిన అంశాలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఇంజినీర్లను ఆదేశించింది. మూడు ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్ల విచారణ జరుగుతోందన్న జస్టిస్ పీసీ ఘోష్, ఇంజినీర్లు అందరినీ ఈ నెల 25వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పారు. అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయని అన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందన్న జస్టిస్, సమస్యలు రాకపోయి ఉంటే ప్రజలకు చాలా ఉపయోగపడేవని పేర్కొన్నారు.

లోపం ఎక్కడుంది, ఏం జరిగిందన్న విషయమై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఎవరి ప్రమేయం అయినా ఉందా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జస్టిస్ ఘోష్ తెలిపారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలుస్తామని అన్నారు. ఈ విచారణలో భాగంగా డ్యాం సేఫ్టీ చట్టానికి లోబడి తీసుకున్న చర్యలు, సూచనలను కూడా ఇంజినీర్ల ద్వారా తీసుకుంది. ఇదే సమయంలో ఆయా సందర్భంగా నిర్మాణ సంస్థ, నీటిపారుదలశాఖ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, పైఅధికారులతో సంప్రదింపులు, వారి ఆదేశాల అమలు సహా సంబంధించిన అంశాలపై కూడా కమిషన్ ఇంజినీర్లను ప్రశ్నించింది. సమస్యలు తలెత్తినప్పటికీ మరమ్మత్తులు ఎందుకు చేయలేదని, అందుకు గల కారణాలపై కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఇంజినీర్లను ఆరా తీసింది. తొలిరోజు ముగ్గురు రిటైర్ట్ ఈఎన్సీలు మురళీధర్(జనరల్) వేంకటేశ్వర్లు(కాళేశ్వరం ప్రాజ్టెక్టు ), నరేందర్ (డిజైన్స్)తోపాటు ఎస్‌ఈలు చంద్రశేఖర్ ,బసవరాజు తదితరులను కమీషన్ విచారణ చేసింది. బుధవారం కూడా విచారణ ప్రక్రియ కొనసాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News