Sunday, January 19, 2025

కేజ్రీవాల్, సిసోడియా, కవితపై విచారణ వాయిదా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రి సిసోడియా, ఎంఎల్‌సి కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. మళ్లీ ఆగస్టు 9న విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ముగ్గురినీ వర్చువల్‌గా కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్‌లో తుది ఛార్జిషీట్ దాఖలు చేశామని గతవారం కోర్టుకు సిబిఐ తెలిపింది. కవితపై సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్ చూసి స్పందించేందుకు కవిత తరఫు న్యాయవాదులు సమయం కోరారు. ఇడి కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ను ట్రయల్ కోర్టు పొడిగించింది. ఆగస్టు 13వ తేదీ వరకు లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News