Thursday, January 23, 2025

బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసు… విచారణ చేపడుతున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

Radisson Hotel bar, pub license revoked

హైదరాబాద్: బంజారాహిల్స్ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల విచారణ చేపడుతున్నారు.  ఇప్పటికే ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకొవడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. అభిషేక్, అనిల్ ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 14 నుంచి 17 వరకు పోలీసులు కస్టడీలో నిందితులు ఉండనున్నారు. నిందితుల బెయిల్ పిటీషన్ ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.  పుడ్డింగ్ అండ్ మింక్ లో దొరికిన డ్రగ్స్ కు వీరికి ఉన్న సంబంధాలపై పోలీసులు కూపీ లాగనున్నారు.  ఈ నెల 14న చంచల్ గూడ జైలు నుండి ఇద్దరు నిందితులు అభిషేక్, అనిల్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.  మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కిరణ్ అనే నిర్వాహకుడు అమెరికాలో ఉన్నట్లు పోలీసులకు మెయిల్ వచ్చింది. తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కిరణ్ వెల్లడించాడు. అర్జున్ కోలకత్తా లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News