కాళేశ్వరం విచారణలో వేగం పెంచిన
జస్టిస్ పిసి ఘోస్ కమిషన్ మూడు
పంప్‌హౌస్‌ల ఇంజినీర్లను విచారించాలని
నిర్ణయం రేపటి నుంచి విచారణకు
రావాలని సంబంధిత అధికారులకు
ఆదేశాలు అఫిడవిట్లను పరిశీలిస్తున్న
కమిషన్ రెండు వారాల్లోగా అన్ని
దస్త్రాలను సమర్పించాలని
నీటిపారుదలశాఖకు ఆదేశాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ వేగం పెంచింది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని పంప్ హౌస్‌లకు చెందిన నీటిపారుదల శాఖ ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్ ఇంజినీర్లను విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది. సోమవారం నుంచి మూడు పంప్ హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈ వరకు ఇంజినీర్లు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇంజినీర్ల నుంచి కూడా అ వసరమైన సమాచారం, వివరాలు సేకరించడంతో పాటు ఆ తర్వాత వారి నుంచి కూడా అఫిడవిట్లు తీసుకోనున్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని కమిషన్ ఆదేశించింది.
రెండు వారాల్లోగా అన్ని దస్త్రాలు ఇవ్వాలని నీటిపారుదల శా ఖకు స్పష్టం చేసింది. తుది నివేదికలు ఇవ్వాలని విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌తో ఆయన మాట్లాడినట్లు సమాచారం. పుణెలోని సీ డబ్ల్యూపీఆర్‌ఎస్‌సి కమిషన్ ఓ ప్రతినిధిని పంపి అధ్యయనం చేయించింది. కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులతో జస్టి స్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. కమిటీ ఇప్పటికే ఆనకట్టలను అధ్యయనం చేసినందున ఆ అంశాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇప్పటి వరకు ఇచ్చిన అఫిడవిట్ల పరిశీలన కొనసాగుతోంది. వాటి పరిశీలన తర్వాత అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి విచారణ చేయనున్నారు.