Friday, November 15, 2024

సెప్టెంబర్ 2న జలప్రవేశానికి స్వదేశీ యుద్ధ నౌక విక్రాంత్ సిద్ధం

- Advertisement -
- Advertisement -

INS Vikrant ready to make waves on September 2

న్యూఢిల్లీ : స్వదేశీ యుద్ధ నౌక విక్రాంత్ సెప్టెంబర్ 2 న జలప్రవేశం చేయనున్నది. భారత్ స్వదేశీయంగా నిర్మించిన మొదటి విమాన వాహక యుద్ధ నౌక ఐఎస్‌ఎస్ విక్రాంత్ ఇండోపసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధించడంలో కీలక పాత్ర వహిస్తుందని ఇండియన్ నేవీ వైస్ చీఫ్, వైస్ అడ్మిరల్ ఎస్‌ఎస్ ఘోర్మడే గురువారం తెలిపారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై విమానం ల్యాండింగ్ ట్రయల్స్ నవంబర్‌లో ప్రారంభం కానున్నాయని, 2023 మధ్యలో పూర్తవుతాయని చెప్పారు. ఈ నౌక నుంచి కొన్నేళ్లు మిగ్ 29 కె జెట్స్ ఆపరేట్ చేయడమౌతుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 న కొచ్చిలో ఐఎస్‌ఎస్ విక్రాంత్ జలప్రవేశ కార్యక్రమం ప్రధాని మోడీ సమక్షంలో జరుగుతుందన్నారు. సుమారు 40 వేల టన్నులకు పైగా బరువున్న యుద్ధ నౌకల్ని తయారు చేసిన దేశాల జాబితాలో భారత్ చేరేలా మోడీ ప్రోత్సహించారని పేర్కొన్నారు. అంతేకాక భారత్ ఐక్యత, వైవిధ్యం దీనివల్ల ప్రతిబింబిస్తుందని ఘోర్మడే తెలిపారు. విక్రాంత్ యుద్ధ నౌక కోసం కోల్‌కతా, జలంధర్, కోట, పుణె, అంబాలా , హైదరాబాద్ , ఇండోర్ తదితర 18 రాష్ట్రాల నుంచి ఎక్విప్‌మెంట్ అందిందని చెప్పారు. భారత్‌లో ఇది మరువరాని రోజు అవుతుందని, రక్షణ పరికరాల తయారీలో భారత్ స్వయం సామర్థం దీని ద్వారా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News