Friday, November 22, 2024

కరోనా కేసుల పెరుగుదలపై ఇన్సాకాగ్ అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

INSACOG alerted on increase in Covid cases

జీనోమ్ సీక్వెన్సింగ్‌కు భారీ సంఖ్యలో శాంపిల్స్ పంపాలని రాష్ట్రాలకు సూచన

న్యూఢిల్లీ : గత వారం రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా బయటపడుతున్న జిల్లాలు, ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇండియన్ సార్స్ కొవ్ 2 జినోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్ ) సూచించింది. కేసుల పెరుగుదలపై శుక్రవారం ఇన్సాకాగ్ సమీక్షించింది. కొత్తగా వస్తున్న కేసుల్లో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు ( మళ్లీ ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం ) ఉండడంతో కొత్తగా ఏమైనా వేరియంట్ లేదా సబ్ వేరియంట్ పుట్టుకొచ్చిందా తెలుసుకోడానికి ఈ నిర్ణయం తీసుకుంది. రొటీన్ సీక్వెన్సింగ్‌లో ఏదైనా సబ్ వేరియంట్‌కు సంబంధించిన ముఖ్యమైన క్లూలను విస్మరిస్తున్నామా ? అనేది తెలుసుకోవడానికి శాంపిళ్లను పెద్ద ఎత్తున పంపాలని సూచించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

ఇప్పటికి మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్, గుజరాత్ తదితర 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 1000 కేసులు నమోదయ్యాయి. గత సమీక్ష సందర్భంగా వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2 తోపాటు బీఏ .4 , బీఏ .5 మాత్రమే దేశంలో వ్యాప్తిలో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇవి కాకుండా కొత్తగా మరేమైనా వేరియంట్లు లేదా ఉపవేరియంట్లు బయటపడ్డాయా అని తెలుసుకోడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దేశంలో కొత్తగా 13,216 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం శనివారం వెల్లడించింది. అయితే ఆస్పత్రుల్లో చేరికలు గానీ, మరణాలు గానీ పెద్దగా లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News