మెల్‌బోర్న్: నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి గుండెజబ్బుల ప్రమాదం పొంచి ఉందని ఓ అధ్యయనంలో తేలింది. గుండెజబ్బులు పెరగడంతోపాటు ముందస్తు మరణాలకు నిద్రలేమి కారణం అవుతోందని తెలిపింది. ఈ మేరకు రిసెర్చ్ నివేదికను బిఎంసి మెడిసిన్ జర్నల్ ప్రచురించింది. యూకె బయోబ్యాంక్‌లోని దాదాపు 3లక్షలమంది మధ్యవయస్సుకు చెందినవారి డేటాను విశ్లేషించి నివేదికను తయారు చేసినట్లు పేర్కొన్నారు.
సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీ సహకారంతో పరిశోధన చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆరోగ్యకర రీతిలో నిద్రపోయినవారితో పోలిస్తే తక్కువ సమయం నిద్రపోయినవారు గుండెజబ్బులతోపాటు అనేక అనారోగ్య సమస్యలుతో బాధపడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇన్‌స్నోమియా, గురక, నిద్రపోవడం, సరిపడినంత నిద్రలేకపోవడం, పగటిపూట నిద్ర తదితర కారణాలతో మహిళలు, పురుషుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు అధ్యయనంలో తేలింది.