Sunday, December 22, 2024

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన

- Advertisement -
- Advertisement -

వెల్దుర్తిః మండల పరిధిలోని శేరి అంగన్‌వాడీ-2, అంగన్‌వాడీ-5 కేంద్రాలను గురువారం పోషణ్ అభియాన్ రాష్ట్ర బృందం పరిశీలించారు. ఈ సందర్బంగా వారు అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లల ఎత్తు, బరువును కొలిచి, పిల్లలకు అందించాల్సిన పోషకాల గురించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… పిల్లల వయసుతో పాటు సరిగా ఎదుగుతున్నారా , వయసు తగ్గ ఎత్తు, ఎత్తు తగ్గ బరువు పిల్లలు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువులను కొలుస్తూ అవసరమైన సలహాలు ఇవ్వాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోషన్ అభియన్ కోఆర్డినేటర్ సరయు, బ్లాక్ కోఆర్డినేటర్ కల్యాణి, సూపర్‌వైజర్ బేతయ్య, అంగన్‌వాడీ టీచర్లు దేవలత, లక్ష్మీ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News