Friday, November 22, 2024

వంతెన నిర్మాణ పనులన పరిశీలన

- Advertisement -
- Advertisement -

మెండోరా : మండలంలోని పోచంపాడ్ గ్రామంలో గల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన కాకతీయ కాలువపై సోన్‌పేట్, పోచంపాడ్ , దూద్గాం, మెండోరా గ్రామాల ప్రజల రాకపోకలకై నూతన పద్దతిలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఆదివారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దయతో నాలుగు గ్రామాల ప్రజల కోరిక మేరకు వంతెన నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో వంతెన నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం జరిగింది.

కానీ వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల, రైతుల కోరిక మేరకు వ్యవసాయం కోసం కాకతీయ కాలువ ద్వారా నీటిని 365 రోజులుఅందించటం వలన వంతెన నిర్మాణం జరగలేదు. బాల్కొండ నియోజక వర్గంలో పంటలు మొక్కజొన్న, సజ్జలు, నువ్వులు, పసుపు పండించడం వలన రైతులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని అన్నారు. కావున కాకతీయ కాలువపై రెండు వంతెనలకి సుమారు 2 కోట్ల 62 లక్షలతో అధునాతన పద్దతిలో వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసి అటు రైతులకు నీటి సౌకర్యం ఇటు గ్రామ ప్రజల రాకపోకలకు దూర భారం తగ్గి మేలు చేకూరేలా చేస్తున్నామన్నారు. మంత్రి వెంట స్థానిక, మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News