Tuesday, December 24, 2024

దమ్మపేటలో కోర్టు పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : దమ్మపేట మండల కేంద్రంలో మల్లారం రోడ్డులోనీ ఎస్సీ బాలుర వసతి గృహంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ నిర్మాణ పనులను శుక్రవారం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిత వాణి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు కోర్టు అవసరాలకు అనుగుణంగా ఎలా నిర్మాణం చేపట్టాలో వివరించారు. అనంతరం కోర్టు ప్రాంగణమంతా తిరిగి కాంట్రాక్టర్‌కు కోర్టుకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏఏ ప్రాంతాల్లో చేపట్టాలో తెలియజేశారు. నెల రోజుల్లో కోర్టు నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రామిశెట్టి రమేష్, సత్తుపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పాకాలపాటి రమేష్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ మారం సతీష్, కార్యదర్శి బుర్ర వెంకట్రావు, న్యాయవాదులు మందలపు రాజేంద్రప్రసాద్, గొంది మురళీమోహన్, జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట వైస్ సర్పంచ్ దారా యుగందర్, అబ్దుల్ జిన్నా, కోర్టు కానిస్టేబుల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News