Monday, December 23, 2024

అభివృద్ధి పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్:నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మంత్రి కెటిఆర్ నిజామాబాద్ నగరానికి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వస్తున్నందున అభివృద్ధి పనులను పరిశీలించారు. నగరంలోని కంఠేశ్వర్ కమాన్ వద్ద ఆర్‌యుబి మహానీయుల వాల్‌పెయింటింగ్‌ను పరిశీలించారు. అలాగే నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పారిశుద్ధ పనులు, మంచినీటి సరఫరాను పరిశీలించారు.

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మున్సిపల్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం అహ్మదీబజార్ సమీకృత మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ పర్యటన సందర్భంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో మేయర్ దండునీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిత్రామిశ్రా, మున్సిపల్ అధికారులు సాగర్, మురళి మోహన్, రషీద్, ఆర్‌అండ్‌బి అధికారులు ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News