Saturday, December 21, 2024

బాన్సువాడలో అభివృద్ధి పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నిర్మాణ పనులతో పాటు కల్కి చెరువు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న చిల్ట్రన్స్ పార్కు, ఉమెన్ పార్కు, సీనియర్ సిటిజన్ పార్కులను పరిశీలించారు. అలాగే అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ జరుగుతున్న పనులను త్వరిత గతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు అంజిరెడ్డి, కమీషనర్ రమేష్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News