Monday, December 23, 2024

ఆసుపత్రి పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: నర్సంపేటలో నిర్మిస్తున్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్ నర్సంపేట నియోజకవర్గానికి 250 పడకల ఆసుపత్రిని రెండేళ్ల క్రితం మంజూరు చేయడం జరిగింది. 1.65 లక్షల స్వేర్ ఫీట్లతో సుమారు రూ. 70 కోట్లతో ఆసుపత్రి దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు.

ఆసుపత్రిని ఎ, బి, సి మూడు బ్లాక్‌లుగా నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. మొదటగా ఆసుపత్రిలోని సీ బ్లాక్‌ను ప్రారంభించి పాత సీహెచ్‌సీ ఆసుపత్రిని ఇక్కడికి తరలించి వైద్య సేవలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. మరో రెండు నెలల్లో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నా మన్నారు. వీటితో పాటు ఆసుపత్రికి సంబంధించిన పలు రకాల సౌకర్యాలైన అటెండెంట్ వేటింగ్ హాల్ షెడ్డు, అంతర్గత సిసి రోడ్లు, క్యాంటీన్, నర్సరీ కోసం మరో రూ. 10 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

వాటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అదే విధంగా నూతనంగా నర్సంపేటకు రూ. 30 కోట్లతో అత్యవసరమై వైద్య సేవల యూనిట్(క్రిటికల్ కేర్ యూనిట్) మంజూరైందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఏకైక మెడికల్ కళాశాలను మన నర్సంపేట నియోజకవర్గానికి మంజూరు కావడం అభినందనీయమన్నారు. సిఎం కెసిఆర్ వైద్య శాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో నర్సంపేట మెడికల్ హబ్‌గా మారనుంది. నర్సంపేట ప్రజలపై ప్రత్యేక ప్రేమతో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇటీవల నర్సంపేట నియోజకవర్గానికి జీవో నంబరు 83 ద్వారా మెడికల్ కళాశాల మంజూరు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వాటి పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో ఎమ్మెల్యే వెంట మున్సిపల్ ఛైర్‌పర్సన్ గుంటి రజనీకిషన్, నియోజకవర్గ నాయకుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు, క్లస్టర్ బాధ్యులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News