Saturday, December 28, 2024

దూలపల్లి కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్‌రోడ్డులో ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రూ.8.45 కో ట్లతో చేపడుతున్న కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్, మైనంపల్లి హనుమంతరావు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు హెచ్‌ఎండిఏ చేపడుతున్న రోడ్డు వె డల్పు పనులకు అనుగుణంగా కల్వర్టు నిర్మాణ పనులను పెంచాలని, అందుకు నిధు లు అవసరమైతే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 40 పనులు పూర్తి కా వడంతో మిగిలి ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను వారు ఆ దేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ నారాయణ, డిఈ నరేందర్, ఏఈ లక్ష్మీ నారాయణ, స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News