- Advertisement -
వరంగల్ కార్పొరేషన్ : తొలి దశ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల తనిఖీ నిర్వహిస్తున్నట్లు వరంగల్ (తూర్పు) నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు. శుక్రవారం ఏనుముల మార్కెట్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూములలో కావాల్సిన సౌకర్యాలు ఉండేలా చూడాలని బల్దియా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స, ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్‌ఓ డా.రాజేష్, ఈఈలు శ్రీనివాస్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -