Monday, January 20, 2025

ఈవిఎం గోడౌన్ పరిశీలన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఈవిఎం గోడౌన్ ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ లను మరియు స్ట్రాంగ్ రూమును ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పరిశీలించడం జరుగుతుందని అందులో భాగంగా మంగళవారం కూడ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందన్నారు. అనంతరం గోడౌన్ పరిసరాలను పరిశీలించి పలు విషయాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గోడౌన్ లో వర్షపు నీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్,ఏఓ సుధాకర్,డిఈఈ మాసూద్,కాంగ్రెస్ ప్రతినిధి మోహన చారి, బీఎస్పీ గోలి అనిల్ కుమార్, బీజేపీ బి. రమణారావు సిపిఐ (ఎం )ఎమ్. వాసుదేవ రెడ్డి,బి ఆర్ ఎస్ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, టిడిపి ఎర్రబెల్లి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News