Thursday, January 23, 2025

ఎరువుల దుకాణాల తనిఖీ

- Advertisement -
- Advertisement -

ధర్మారం: మండల కేంద్రంలోని విత్తన దుకాణాలను జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి పూర్ణిమతోపాటు సిబ్బంది విస్తృతంగా తనిఖీ చేశారు.విత్తన దుకాణాలలోని నిల్వ ఉన్న విత్తనాలను పరిశీలించడంతోపాటు, స్టాక్ రిజిష్టర్‌లను పరిశీలించారు.

రైతులు విత్తనాలు కొన్న వెంటనే బిల్లులు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ తెలిపారు. ఇప్పటికే మందులు, విత్తనాల దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశామని రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా సంప్రదించాలని పూర్ణిమ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News