Sunday, January 19, 2025

జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూం పరిశీలన

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: నగరంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో జిహెచ్‌ఎంసి యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రజలు ఏ మాత్రం ఆందోళన పడాల్సిన పని లేదని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న చోట డి ఆర్ ఎఫ్ టీంలు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం పనిచేస్తున్నాయని తెలిపారు. శుక్రవారం ఆమె జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ నగర వాసులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూమ్ 040- 21111111 నంబర్ కు గానీ డయల్ 100, మై జిహె చ్‌ఎంసి యాప్ ద్వారా తెలియజేయాలని కోరారు. నగరవాసుల నుంచి వస్తున్న ఫిర్యాదులను జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూమ్ నుండి ఈ సందర్భంగా ఆమె మానిటర్ చేశారు.కంట్రోల్ రూమ్ కు నగరవాసుల నుండి వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ వాటర్ వర్క్, విరిగిపోయిన చెట్ల నేల కూడం తదితర సమస్యలపై అందిన పిర్యాదులు అందిన వెంటనే సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులకు తెలియజేసి వాటిని పరిష్కారించిన అనంతరం ఫిర్యాదు దారుడికి తెలియజేస్తున్నామని ఓఎస్‌డి అనురాధ డిప్యూటీ మేయర్‌కు వివరించా రు. అంతకు ముందు డిప్యూటీ మేయర్ హుస్సేన్ సాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నీటి మ ట్టంతో పాటు దిగువుకు వదలుతున్న వరదనీటిని డిప్యూటీ మేయర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News