హుస్నాబాద్ : రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే సిఎం కెసిఆర్‌ర లక్షమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్‌లోని కిషన్ నగర్‌లో రూ. 17 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిఇంచిన ఇంటిగ్రేటెడ్ భవానాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన వికేంద్రికరణతోనే పట్టణాలు అభివృద్ధి ్ద చెందుతున్నాయన్నారు. ప్రజలు అందుబాటులో ఉండేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే భవనంలో ఉండా లని ఇంటి గ్రేటెడ్ సమీకృత కార్యాలయ భవన సముదాయ భవనాన్ని నిర్మించడం జగిందన్నారు. ఈ భవనాన్ని ఆగస్టు రెండవ వారంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభం చేసుకుంటామన్నారు. ఈ ఐఓసి భవనంలో ఆర్డీఓ, ఎమ్మార్వో, హుస్నాబాద్ ఈఈ, ఆర్‌అండ్‌బిఈఈ, నేషనల్ హైవే ఈఈ ఆఫీసులు ఉంటాయని తెలిపారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి గ్రేటెడ్ భవన నిర్మాణ పనుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
- Advertisement -