యాదాద్రి భువనగిరి: భూదాన్‌పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో ఆదివారం ఎమ్మేల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెల్సుకున్నారు. ఈసందర్బంగా 5,6,11,13వ వార్డుల్లో నిర్మాణంలో అంతర్గతడ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈసందర్బంగా అ ధికారులు అసంపూర్తిగావున్న సిసిరోడ్లు, అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులను గుర్తంచిత్వరితగతిన పూర్తిచెయ్యాలన్నారు.
ప్రజల సహకారంతో పోచంపల్లి పట్టణంలో నూరు శాతం సిసిరోడ్లు, అంతర్గత డ్రైనేజీలు పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం ఇటీవల కురుస్తున్న వర్షాలతో నిండు కుండాల మారిన పోచంపల్లి పెద్ద చెర్వును పరిశీలించారు. చెర్వు అలుగుపోస్తున్న తీరును తిలకించి అక్కడవున్న మత్సకారులతో సమస్యల గురించి అడిగి తెల్సుకున్నారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మిశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్ సభ్యులు పెద్దల చక్రపాణి, గుండు మధు, దేవరాయ కుమార్, నాయకులు తదితరులు ఉన్నారు.