Monday, December 23, 2024

సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీలు

- Advertisement -
- Advertisement -

వర్గల్ ః ఫర్టిలైజర్ దుకాణాలలో నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని వ్యవసాయ అధికారి శేషశేయన , సిఐ సంపత్‌లు అన్నారు. శని వారం వర్గల్ మండల కేంద్రంలోని గౌరారం, వర్గల్ లలో సీడ్స్, ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భా గంగా స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్ ,బిల్ బుక్కులతో పాటు తదితర రికా ర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీడ్స్ , ఫర్టిలై జర్ దుకాణాదారులు నకిలి విత్తనాలు ,పురుగుల మందు అమ్మవద్దని అమ్మినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులను ఎలాంటి విషయంలో మోసం చేసిన యజమానులపై కఠీనంగా వ్యవ హరిస్తామని రైతులు కూడా ఆప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారుల సల హాసూచనల ప్రకారం విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేశాక తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అలాగే గ్రామాలలో విడి విత్తనాలు, నకిలీ విత్తనాలు ఉన్నట్లు కానీ అమ్మినట్లు కానీ తెలిస్తే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలన్నారు. వీరితో పాటు ఎఎస్‌ఐ మధుసూదన్ రెడ్డి, కానిస్టేబుల్ పరుశరాం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News