Wednesday, January 22, 2025

సిసిరోడ్డు పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న అభివృద్ధ్ది పనులలో నాణ్యత ప్రమాణాలు పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరగృహకల్ప కాలనీలో చేపడుతున్న సిసిరోడ్డు పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీవాసులకు ఇబ్బంది కలగకుండ సిసిరోడ్డు నిర్మాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి దన్‌పాల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు డప్పుగిరిబాబు, నాయకులు జనంపల్లి వేంకటేశ్వర్‌రెడ్డి, సిసిఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, సార అనిల్‌కుమార్, జౌండ్ల ప్రభాకర్‌రెడ్డి, గంపక్రిష్ణ, సత్యానారయణ, చంద్రమౌలి, ఇందిరగృహకల్ప కాలనీవాసులు సాగర్‌గౌడ్, వెంకన్న, ప్రవీన్‌సోమేష్, హరిబాబు, చిన్న రమేష్, జయరాం, వెంకట్‌గౌడ్, నవనీతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News