Monday, December 23, 2024

కామునికంత బస్తీలో జరుగుతున్న నూతన కమ్యూనిటీ హాల్ పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: మన్సూరాబాద్ కుమ్మరి బస్తీలో త్వరలో నూ తన కమ్యూనిటీ హాల్‌కు నిధులు త్వరలో విడుదల జరుగుతాయని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలో కాముని కంత బస్తీ జరుగుతున్న నూతన కమ్యూనిటీ హాల్ పనులను ఆయన పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం ప్రతిబస్తీ, ప్రతి కాలనీ అభివృద్ధి ధ్యేయం అన్నారు. మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి మాట్లాడుతూ నేను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ఐదు నూతన కమ్యూనిటీ హాల్స్ కోసం దాదాపు రూ.50 లక్షలు జీహెచ్‌ఎంసీ నిధులు మంజూరు చేయిస్తూ పట్టణ ప్రణాళిక అధికారులు అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు.

వీరన్నగుట్ట, ఎల్‌ఐసి కాలనీలో సామాజిక భవనం ని ర్మించడం జరిగింది. వీకర్‌సెక్షన్ కాలనీ, కుమ్మరిబస్తీలో నూతన కమ్యూనీటీ హాల్ పనులు టెండర్ దశలో ఉండడం జరిగింది, అతిత్వరలో ఈ ప నులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మాజీ డివిజన్ అధ్యక్షులు టం గుటూరి నాగరాజు, జగదీష్ యాదవ్, యువ నాయకులు జక్కడి రఘువీర్‌రెడ్డి, నగేష్ యాదవ్, త్రిలోక్‌గౌడ్, అఖిల్‌యాదవ్, శివశంకర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News